కృష్ణా: గుడివాడ అరవపేట,స్లేటర్ పేట,చౌదరిపేట,చెంచు కాలనీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ అవుట్‌ఫ్లో పరిస్థితిని ఎమ్మెల్యే రాము ఈరోజు పరిశీలించారు. ప్రజలను కలిసి వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చెంచు కాలనీ ప్రాంతంలో ఎదురవుతున్న డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.