KRNL: దేవనకొండ మండలంలోని తెర్నెకల్ గ్రామంలో మంగళవారం జరిగే రచ్చబండ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పాల్గొంటారని వైసీపీ మండల కన్వినర్ రామకృష్ణ సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామ ప్రజలకు ఇబ్బందులుంటే ఎమ్మెల్యేకు విన్నవించాలని ఆయన పేర్కొన్నారు.