తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నంలో అత్యధికంగా 16 సెం.మీల వర్షపాతం నమోదైంది. విల్లుపురం, పుదుచ్చేరిలో కుండపోతగా వానలు పడుతున్నాయి, అనేక కాలనీలు నీట మునగడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పుదుచ్చేరి, కారైకాల్, విల్లుపురంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.