ప్రకాశం: కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ఎస్పీ వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం విచారణకు ఆదేశించారు.