ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం చివరి మంగళవారం సందర్భంగా ఆలయంలో శివునికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు స్వామివారికి కార్తీక మాస పూజలో భాగంగా శివుడికి అభిషేకాలు, ఆవు నెయ్యితో దీపారాధన పూజలు, పండ్లు, మారేడు దళాలను సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.