WG: చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో నిమోనియా నిర్వహణపై గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే సీహెచ్ఐలు ముందస్తు డోసు ఇవ్వాలని అన్నారు.