AP: శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి ఇవాళ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీ, ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని, రాష్ట్రపతి సహా ఇతర ప్రముఖుల పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని సూచించనున్నారు.