NLG: చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ, పులిహోర విక్రయ కౌంటర్లతో పాటు ప్రసాదాల తయారీ కేంద్రాన్ని నిన్న సాయంత్రం ఈవో మోహన్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో భాగంగా సిబ్బంది ప్రసాద నాణ్యత, పరిమాణాలపై తగు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణ పరిశుభ్రత నిర్వహణపై శివసత్తులకు అవగాహన కల్పించారు.