NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో ఈనెల 22న ఉమ్మడి జిల్లా 18 ఏళ్లలోపు బాలబాలికలకు ఖోఖో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖోఖో సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గండ్రత్ ఈశ్వర్ ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారిని ఉమ్మడి అదిలాబాద్ జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. వారు 44వ రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారన్నారు.