AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకం రెండో విడత నిధులను ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రాష్ట్రంలో సుమారు 46 లక్షల మంది రైతులకు ఈ లబ్ధి చేకూరనుంది. ప్రతి రైతు ఖాతాలో రూ. 7,000 జమ చేయనున్నారు. ఈ మొత్తంలో రాష్ట్ర వాటా రూ. 5,000, కేంద్రం వాటాగా రూ. 2,000 ఉంటాయి. సీఎం చంద్రబాబు కడప జిల్లాలో ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు.