KMR: ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2025-26 సంవత్సరానికి గాను ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ అందించనున్నాయి. అర్హులైన ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ. 4వేలు మంజూరు చేయబడుతుందని వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జయరాజ్ సోమవారం తెలిపారు. tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.