KNR: చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిన్న సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 87 మంది బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. వాతావరణ మార్పుల దృష్ట్యా విద్యార్థినులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమ్యూనిటీ హెల్త్ అధికారి వెంకటస్వామి సూచించారు.