GNTR: తాడికొండ మండలం బండారుపల్లి మేజర్ కెనాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని మంగళవారం ఉదయం పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఆ మహిళ వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. పరిసర గ్రామాలలో విచారణ చేసినా ఆచూకీ లభ్యం కాలేదు. స్థానిక వీఆర్వో ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.