SKLM: మెళియాపుట్టి మండలం బంజీరు లింగాపురం గ్రామాల వద్ద ఉన్న గ్రానైట్‌లో హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్న రానా కర్రన్న (45) సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య తులసమ్మ, కొడుకు విష్ణు శ్యామ్ ఉన్నారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొండపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడటంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. SI పిన్నింటి రమేష్ కేసు నమోదు చేశారు.