అన్నమయ్య: భార్య, కవల పిల్లల మృతి తట్టుకోలేక భర్త సూసైడ్ చేసుకున్న ఘటన HYDలో జరిగింది. రైల్వేకోడూరు (M) కొండారెడ్డిపోడు వాసి విజయ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో పని చేస్తున్నాడు. IVF ద్వారా అతని భార్య శ్రావ్య గర్భం దాల్చింది. అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స చేస్తుండగా గర్భంలోని కవల పిల్లలు, భార్య మృతి చెందారు. ఇది తట్టుకోలేని అతను సూసైడ్ చేసుకుని మరణించినట్లు సమాచారం.