MDK: తూప్రాన్ పట్టణ పరిధి బ్రాహ్మణపల్లి రైల్వే లెవెల్ క్రాసింగ్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రాహ్మణపల్లి లెవెల్ క్రాసింగ్ నుంచి లింగారెడ్డిపేట వైపు ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి శవాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.