కృష్ణా: గుడివాడ సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు. నిన్న గుడివాడలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ అభివృద్ధిపై మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను కమిషనర్ మనోహర్ వివరించారు. సంక్షేమ పథకాలు ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే చూడాలన్నారు.