TPT: జిల్లాలో ఈనెల 20, 21వ తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. భద్రతాపరమైన చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా పర్యటన ఏర్పాట్లు చేయాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు అధికారులను ఆదేశించారు. అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రముఖులు పర్యటన ముగిసే వరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.