జీవితంలో ఆనందం, సంతృప్తి, ఆరోగ్యం పొందడానికి ఎలాంటి ప్రత్యేక ప్రతిభ అవసరం లేని కొన్ని పనులు ఉన్నాయి. ఇతరుల పట్ల దయగా ఉండటం, నిజాయితీతో జీవించడం, మనస్ఫూర్తిగా నవ్వడం, స్నేహితులతో గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరిగా నిద్రపోవడం, ఆటలాడటం.. ఈ పనులను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటిని పాటించిన వారికి ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి గ్యారంటీగా దక్కుతాయి.