పార్వతీపురం మండలం తాళ్ళబురిడీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతుల కష్టాలను తెలుసుకున్న కూటమి ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రతిచోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. అలాగే రైతులే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు.