ఢిల్లీలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. జామియానగర్లోని వర్సిటీ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలకు వర్సిటీ నిధులు మళ్లించడంపై ఆరా తీస్తున్నారు. అల్ ఫలాహ్ వర్సిటీ కేంద్రంగా జైషే ఉగ్రవాద మాడ్యుల్ ఉందని అధికారులు భావిస్తున్నారు.