కృష్ణా: చేవెండ్రపాలెం గ్రామంలో ఎయిర్టెల్ సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని గ్రామస్థులు మంగళవారం అడ్డగించారు. తమ నివాస గృహాల మధ్య సెల్ ఫోన్ టవర్ను నిర్మించడానికి వీలు లేదని అన్నారు. దాని నుంచి వచ్చే అధిక రేడియేషన్ వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, పక్షులు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని అన్నారు. అందుకే తక్షణమే సెల్ టవర్ నిర్మాణం ఆపివేయాలన్నారు.