KDP: మైదుకూరు మునిసిపాలిటీ పరిధిలోని వనిపెంట రోడ్డు, విజయ నగర కాలనీ వాసులకు గత 3 రోజులుగా తాగు నీటి రావడం లేదు. ఆ ప్రాంతంలో ఉన్న నీటి మోటార్ 3 రోజులుగా పనిచేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని నీటి సమస్యను పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు.