NLG: చందంపేట మండలం గన్నెర్లపల్లి చెంచుకాలనీలో 200 మంది గిరిజనులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా మిషన్ భగీరథ నీరు నిలిచిపోగా.. స్థానికంగా ఉన్న బోర్లు కూడా పనికి చేయడం లేదు. దాంతో వారు డిండి ప్రాజెక్టు కాలువలోని అపరిశుభ్ర నీటిని సేకరించి బురద వడబోసి తాగుతున్నారు. వెంటనే తాగునీరు అందించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.