NZM: మోపాల్లోని బీసీ హాస్టల్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ సభ్యులు రగ్గులు పంపిణీ చేశారు. ప్రస్తుతం చలితీవ్రత అధికంగా ఉందని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో 55 మంది విద్యార్థులకు నిన్న రాత్రి రగ్గులు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి బీసీ హాస్టళ్లకు రగ్గుల పంపిణీ లేనందున పిల్లలను చలి నుంచి కాపాడేందుకు తాము అందించినట్లు పేర్కొన్నారు