HYD: కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారంలో మరోసారి పురుగులు దర్శనమిచ్చాయి. సోమవారం రాత్రి హాస్టల్లో అన్నం తినే సమయంలో పురుగులు కనిపించాయని.. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విద్యార్థులు కోరారు.