శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ పోలినాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం నేరుగా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.