కృష్ణా: మధురానగర్ వంతెన వద్ద శివాలయంకు నడుచుకుంటూ వెళ్తున్న భానునగర్కు చెందిన లక్ష్మి మెడలో నుంచి దుండగులు 7 కాసుల బంగారు గొలుసు అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆగంతకులు వెనుక నుంచి వచ్చి గొలుసు తెంచుకొని పారిపోయారు. ఈ ఘటనపై గుణదల సీఐ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.