NZB: అరుణాచలంలో మాదిరిగానే ఆర్మూర్ పట్టణంలో నేడు సప్త హారతి గిరి ప్రదక్షిణ జరగనుందని శ్రీ నవనాథ సిద్దేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు కుమార్ పంతులు తెలిపారు. కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉందని నిన్న పేర్కొన్నారు. శ్రీ శివపార్వతులతో పాటు శ్రీ సీతారాముల విగ్రహాలను రథోత్సవంపై ఊరేగింపు చేస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.