ADB: కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో 1, 3, 5 సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల అధికారులు తేలిపారు.