KMM: పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత నిన్న తీర్పు చెప్పారు. చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సయ్యద్ లాలూ అత్యాచారం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.