ADB: రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా రైతు సంఘాల నాయకులు మంగళవారం కోరారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21న బోరజ్ వద్ద నిర్వహించనున్న హలో రైతన్న చలో బోరజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తేమ శాతంతో సంబంధం లేకుండా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.