ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణలోని పాల్వంచ నుంచి నెల్లూరులోని ఆత్మకూరు వైపు జామాయిల్ లోడుతో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ సాయి వాహనంలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై నాగమల్లేశ్వర రావు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.