ADB: మత విద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని బోథ్ సీఐ గురుస్వామి సోమవారం తెలియజేశారు. ఇరు వర్గాలను రెచ్చగొట్టేలా వాట్సాప్ నందు పోస్ట్ చేసిన బొడ్డు శ్రీనివాస్‌తో పాటు గ్రూప్ అడ్మిన్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల లక్ష్యం అని అన్నారు. విద్వేషాలను పోస్ట్ చేసే వారి వివరాలను పోలీసులకు అందజేయాలని కోరారు.