ASR: అనంతగిరి మండలంలోని కోనాపురం పంచాయతీ నుంచి బొర్రా గేటువలస వరకు 7 కిలోమీటర్ల తారురోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 22 ఏళ్లుగా నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో పాటు ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో రోడ్డు పూర్తిగా పాడై రాళ్లు బయటకు తేలిపోయాయి. వందలాది వాహనాలు, వేలాది మంది నిత్యం ప్రయాణించే ఈ కీలక మార్గం అధ్వాన్నంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.