SRCL: వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మేడారం సమ్మక్కసారక్క జాతరకు వెళ్లడానికి ముందు ఆనవాయితీ ప్రకారం నిన్న తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు ఇవాళ బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వారు తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం సమర్పించారు.