కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నిన్న ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు వారి యొక్క దైనందిన జీవితంలో ఎదురుకునే ప్రతి సమస్య గూర్చి పరిష్కారం కోసం పోలీస్ శాఖను ఆశ్రయిస్తారన్నారు. పోలీసులను ఆశ్రయించే ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యను సానుకూలంగా విని, చట్ట పరిధిలో వారి సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు.