SKLM: మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. వజ్రపుకొత్తూరు( M) గుల్లల పాడు నుంచి పలాస వరకు కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సును జండా ఊపి ఆమె సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగు పడితే మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని పేర్కొన్నారు.