GDWL: నడిగడ్డ ప్రజల ఇష్టదైవం, జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో కార్తీక మాసం చివరి మంగళవారం సందర్భంగా విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారికి కృష్ణానది జలాలతో అభిషేకం నిర్వహించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి, తీర్థప్రసాదాలను అందజేశారు.