SRCL: పుట్టపర్తి సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సాయిరాం జయంతి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిరాం పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు, ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.