KMM: కామేపల్లి మండలంలో ఆదివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వివాహ వేడుకకు ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ముచ్చర్ల గ్రామంలో రోడ్డుపై డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఎమ్మెల్యే గమనించి సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలే మరణించిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించారు.