TG: సత్యసాయి బాబా ప్రేమతో మనషులను గెలిచారని.. సేవలతో ఆయనను దేవుడిగా కొలుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారు. సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కరవు కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడుకు కూడా తాగు నీటిని, వైద్యాన్ని అందించారని పేర్కొన్నారు.