JNG: గ్రామ పాలనాధికారుల(GPO) సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా పెండెల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు జనగామకు చెందిన శ్రీనివాస్‌ను రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.