KRNL: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుకు నిరసనగా సోమవారం కర్నూలులోని వైఎస్సార్ విగ్రహం ఎదుట వైసీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.