EG: రాజమండ్రికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫణికుమార్ ఇన్స్టాగ్రామ్కు ఓ లింక్ వచ్చింది. లింక్ ఓపెన్ చేసి తొలుత తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి డబుల్ లాభం పొందాడు. దీంతో నమ్మకం కలిగి, రూ. 18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు.