సొంత గడ్డపై జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో VVS లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా నియామకం చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.