WGL: వాతావరణంలో పొగ మంచు తీవ్రత పెరగడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని CP సన్‌ప్రీత్ సింగ్ సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు.