ATP: పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద అనంతపురం, సత్యసాయి జిల్లాల రైతులకు నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని 5,40,682 మంది రైతుల కోసం రూ.367.68 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 19న రైతుల ఖాతాల్లో ఈ నగదును నేరుగా జమ చేయనున్నట్లు జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, రామూనాయక్ తెలిపారు.