HYD: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓఆర్ఆర్ సమీపంలో గల తొర్రూర్ ప్రాంతంలోని 59 ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు మంచి స్పందన లభించింది. తొలి రోజు వేలంలో చదరపు గజానికి అత్యధికంగా రూ. 39 వేల ధర పలికింది. సగటున రూ. 28,700 ధర నమోదైంది. ఈ విక్రయాల ద్వారా మొత్తం రూ. 46 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు.