NZB: జిల్లా పోలీసు కార్యాలయంలో నిన్న సాయంత్రం వరకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆయన 20 అర్జీలను స్వయంగా స్వీకరించారు. వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఎస్సై, సీఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యల స్థితిని తెలుసుకుని, తగిన సూచనలు చేశారు.